మనసుకి బాధ కలిగినప్పుడు అనిపిస్తుంటుంది
మనుషులే కాదు దేవుడు కూడా పగ తీర్చుకోవడానికి సాధిస్తున్నాడా అని…
ప్రేమ కావచ్చు, పెళ్లి కావచ్చు, జీవితం కావచ్చు మధ్యలోనే ముగిసిపోతుంది అని తెలిసిన …అలాంటి
బంధాలను బంధుత్వాలను ఇచ్చి ఎందుకు ఏడిపిస్తున్నాడు…!
ఏదైనా అంటే పూర్వ జన్మ కర్మ ఫలం అంటారు పెద్దలు
అదే నిజం అయితే …
గుడికి వెళ్ళినప్పుడు దీర్ఘ సుమంగళీ భవః , సర్వ పాప నివారణం , పునః దర్శన ప్రాప్తిరస్థు అంటూ…
అదే దేవుడి ముందు పంతులు గారు దీవిస్తారు.
మరి అలాంటప్పుడు పూర్వ జన్మ కర్మ ఫలం పోవాలిగా…
అందుకే రాను రాను మనుషుల మీదే కాదు
దేవుడి మీద కూడా నమ్మకం పోతుంది.
తప్పులు చేసే వారికి ఉన్న ఆనందం
కష్టాలు అనుభవించే వాళ్లకు ఎందుకు ఉండదో
ఆ దేవుడికే తెలియాలి.
Leave a Comment