బంధం

బంధమంటే బాధ్యతలను బరువుగా అనుకోకుండా సక్రమంగా నెరవేర్చడం .

బంధమంటే నీకు నేనున్నానే నమ్మకం భరోసా ఇస్తూ ప్రేమ ఆప్యాయతలు పంచడం .

బంధమంటే బాధించేవారుంటే ఆ బాధలను తేలిక చేసి
అనునయంగా ఓదార్చడం .

బంధమంటే కష్టకాలంలో ఒంటరైతే కనిపెట్టుకొని
ఆగని కన్నీరు తుడవడం.