ఆలోచనలు పంచుకునే స్నేహితునిగా
సమాజ స్వభావాన్ని నేర్పే గురువుగా
భార్యకు బిడ్డకు మధ్యవర్తిగా
సరైన మార్గంలో నడిపించే మార్గదర్శిగా…
కూతురి మొదటి ప్రేమ నాన్న
కూతురు మెచ్చే హీరో నాన్న
కూతురి బలం బలగం ధైర్యం నాన్న
కూతురి జీవిత నావకు చుక్కాని నాన్న.
కళ్లలో నీళ్లు పెట్టుకొని
కాళ్లు కడిగి కన్యాదానం చేసి
కష్టం దరిచేరనీయకుండా కలకాలం కళ్లలో
పెట్టుకొని దాచుకునేదే నాన్న .
బంధువులు మాటలతో పొడుస్తుంటే
అక్కున చేర్చుకునే ఆదర్శమూర్తి నాన్న.
జన్మనివ్వకపోయినా జీవితానిచ్చే నాన్నకు ఈ జీవితం అంకితం.
Leave a Comment