భార్యా భర్తలు

కష్టాలు చవి చూసాము.. కలిసి తీర్చుకున్నాము.
బాధలు పంచుకున్నాము.. బంధాన్ని పెంచుకున్నాము.

బాధ్యత గా మెలిగాము.. బతుకు బండి లాగాము.
అలకగా వున్నాము.. అర్థం చేసుకున్నాము.

ఒకరికొకరుగా బ్రతికాము.. ఒక్కటిగా నిలిచాము.
ఆటుపోట్లు భరించాము.. ఆశయాలు సాధించాము.

సంతోషాన్ని త్యాగం చేస్తాము..
సంతానాన్ని ప్రయోజకుల్ని చేసాము.
బాధల్ని గొంతులో దాచాము..
అమృతాన్ని బిడ్డలకి పంచాము.

దేహాలు వేరుగా శ్వాసించాము..
ప్రాణం ఒకటిగా జీవించాము.
జీవితమనే పుస్తకాన్ని చదివాము..
ఆఖరి మజిలికి చేరుకున్నాము.