అమ్మా నాన్నలు

ఒంట్లో తరిగిపోతున్న రక్తబిందువులు
చర్మం మీద చెమ్మగిల్లుతున్న చెమట చుక్కలు
మా అమ్మా నాన్నలు

వాళ్ళ సుఖసంతోషాల మరుపు కష్ట నష్టాల భరింపు
మా మానసిక వికాసం కోసం ఇన్నేళ్ల ఎడబాటు వాళ్ళ కన్నీళ్లు
మా ఎన్నో ఏళ్ళ బంగారు భవిష్యత్తు బాట కోసం…

బంధాల్ని నిలబెట్టుకుంటూ సాగుతూ అమ్మ
బాధ్యతల్ని నెరవేర్చుకుంటూ నడుస్తూ నాన్న
బిడ్డల బతుకుదెరువు కోసం తమ బతుకులను ధారపోస్తున్నారు ఇద్దరూ…

నెత్తురు సడిలిపోతున్న సత్తువ సచ్చిపోతున్నా పిల్లల పూలపాన్పు కోసం వారి పయనం ముళ్ల దారి మీదే …
అప్పుల తిప్పలు పడుతూ కుటుంబ నావను నడిపే నావికులు. కాలంతో పాటు పాటుపడుతూ గడియారంలోని రెండు ముళ్ళలా పోటీపడుతూ రెక్కలు ముక్కలు చేసుకుంటున్న లక్ష్యమున్న నిరక్షరాస్యులు.