బాధ్యత

తొలి పొద్దున నుదుటిపై ఎర్రని బొట్టుగా పెట్టుకొని
అలా దగ్గరై పెదాల అంచుల్ని చిన్న స్పర్శలకు
అనురాగాల ఆత్మ బంధువయి మారిపోయి

పగలంతా అందనంత ఎత్తులో ఆకాశంలో
అంతా తానే ఉద్దరిస్తున్నట్లు
మంటల సెగలై ఉడికిపోతూ
ఎన్ని ఆటుపోట్లు ఎదురైన ప్రేమను కురిపిస్తూ…

నీతుల చేతిల పరిమళాల పొదల్ని
కోపాల తాపాల మానవాకారాల్ని…ఎండమావులు ఎదురవుతున్న దాన్ని తట్టుకొని కనిపెడుతూ…

కాలం మీదకి న్యాయసూత్రాన్ని వదిలేసి
బాధ్యతల పదానికి నిలువెత్తు రూపమై,
భూమాతకు మరో రూపం మహిళ !
జీవన సృజనశీలి మహిళ !