నేను

నా చేతులతో దుఃఖాన్ని కౌగిలించుకున్నా
అది నా గుండెల్లో ఇంకిపోయింది
నా కళ్ళతో వర్షాన్ని కోరుకున్నా
అది నా భూమి తల్లి గుండెల్లో ఇంకిపోయింది
అయితేనేం…
మట్టి కడుపులోంచి ఓ విత్తనం మొలకెత్తినట్టు
నా హృదయంలోంచి ఓ చిన్న విత్తనం మొలకెత్తి చిగురించింది.

నేనెప్పుడూ నాలా ఉండాలనే కోరుకుంటున్నాను
ఎందుకంటే నాకు నటించడం చేతకాదు
కష్టాలు కన్నీళ్లు తెలుసు
ప్రేమించడం , స్నేహం చేయడం తెలుసూ.. అందుకే…
నేను మరెవ్వరిలా ఉండలేను…!!!