నా జీవితం

అంతులేని జీవితపు సముద్రంలో కంటికి కనిపించే ప్రాంతం మొత్తం నీటితో నిండి ఉంది .
ఆ సముద్రపు నడి బొడ్డున చిన్న పడవ …
ఆ చిన్న పడవలో నేను ఇక నా పయనం మొదలుపెట్టి ఇక్కడి వరకు చేరుకోవడానికి ఎన్నో ఘోర ప్రయాసలను ఓర్చుకుంటూ వచ్చాను .
అవతలి తీరానికి చేరాలంటే కావాల్సిన ఇంధనం లేదు .
చుట్టూ అంధకారంగా ఎటు చూసినా నీరే..
దిక్కు తోచని స్థితిలో వున్నా ఎటు పోవాలి ఏం చేయాలి…!
ఎంత ఆలోచించిన అంతు చిక్కని పయనానికి దారి ఎటు…!!