ఓ మగువా

ఓ మగువా ఏమైంది నీలోని తెగువా
ఓ మగువా ఎక్కడ దాగిందో నీలోని ఓగువా
ఓ మగువా లోకంలో నువ్వే నీకు లోకువా

గుండెలో దాగిన భయం నిన్నంతగా తొలిచేనా
కన్నీటి సంద్రంలో మునిగి
కళ్ళలో సెలయేరులే పొంగి పొరలేనా

ఓటమి నేర్పిన పాఠం నుండి నేర్చుకో
గుణపాఠం నేర్చుకో…నిజాయితీగా నడుచుకో
నీ తలరాతను నీవే మార్చుకో…

తాళి కట్టినవాడికైనా …నీ తోడబుట్టిన వాడికైనా …
కడుపున పుట్టిన వాడికైనా…
పెంచుకో నీ విలువలు పెంచుకో…
ఉంచుకో ఉంచుకో అమ్మవు నీవని గుర్తుంచుకో.