అభివృద్ధి

ఎదగడం అంటే …ఎవరికి అన్యాయం చేయకుండా
ఎప్పుడూ ఓటమికి భయపడకుండా
కన్నీరును పన్నీరుగా భావించి
మునిగే నదిలో కూడా ఒడ్డుకు చేరి
విజయాన్ని పొందాలనే కుతూహలంతో
అపజయాన్ని జయించాలనే ఉత్సాహంతో

మళ్లీ మళ్లీ పడిలేచిన కెరటమై
బాధలను భరించి నిలిచే ఊరటమై
పది మంది మేలు కోరుతూ
మదిలో స్థానం సంపాదించుకుని
నిలువెత్తు సత్యంలా , శాంతిలా
నిబిడీకృతమైన గరళ కంఠునిలా
నవ్వులు చిందిస్తూ నిలవడం ఎడగడమంటాను .
ఎదిగే కొద్దీ ఓదగమంటాను.